అంధకారం లో ఔటర్ రింగ్ రోడ్

Published: Saturday April 16, 2022
హైదరాబాద్ 15 ఏప్రిల్ ప్రజాపాలన : గత కొద్ది రోజులుగా ఔటర్ రింగ్ రోడ్ పైన సెంట్రల్ లైటింగ్ కొన్ని ప్రాంతాలలో పనిచేయని కారణంగా సంబంధించిన ప్రాంతం అంధకారంగ మారింది. ఔటర్ రింగ్ రోడ్ లోని ఎగ్జిట్ 5, 6 మరియు ఎగ్జిట్ 7, 8 ప్రాంతాల్లో కొంత మేర సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ గత కొన్ని రోజులుగా పనిచేయటం లేదు. దీనితో వాహన దారులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. సంబంధిత అధికారులు అవుటర్ రింగ్ రోడ్డుపై పని చేయని సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను గుర్తించి వెంటనే మరమత్తులు చేయవలసిందిగా వాహన దారులు కోరుతున్నారు.