డివిజన్ స్థాయిలలో ప్రజావాణి నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Tuesday March 22, 2022
వికారాబాద్ బ్యూరో 21 మార్చి ప్రజాపాలన : సత్వర సమస్యల పరిష్కారానికి మండల, డివిజన్ స్థాయిలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిఖిల తాసిల్దార్ లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధరణి సమస్యలపై ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని మండల స్థాయిలో గురువారం, డివిజన్ స్థాయిలో శుక్రవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు మాత్రమే ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో  వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి సమస్యలు పరిష్కారించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. మండల స్థాయిలో తాసిల్దార్ లు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా రెవెన్యూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో 238 దరఖాస్తులు వచ్చాయి. అందులో ధరణి, రైతుబంధు సమస్యలతోపాటు రేషన్ కార్డులకై  దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమంలో వికారాబాద్, తాండూర్ ఆర్ డి వో లు విజయ కుమారి, అశోక్ కుమార్, కలెక్టరేట్ కార్యాలయ పరిపాలన అధికారి హరిత తో పాటు వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.