నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు అందించాలి

Published: Thursday June 30, 2022
 వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో జూన్ 29 ప్రజా పాలన :  నిర్దేశించిన లక్ష్యం మేరకు 2022-23 సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు వంద శాంతం రుణాలు అందించి పూర్తి లక్ష్యాన్ని సాధించాలని బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లు, సంక్షేమ శాఖ అధికారులతో డిసిసి, డియల్ ఆర్సి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది.  ఈ సందర్బంగా గత సంవత్సరం 2021-22 లో చేపట్టిన పురోగతిపై కలెక్టర్ సమీక్షిస్తూ, జిల్లాలో మొత్తం  రుణాలు రూ.1715 కోట్ల లక్ష్యం కాగా, రూ.1281 కోట్ల రుణాలు అందించి 75 శాంతం లక్ష్యం సాధించడం జరిగిందన్నారు.  పంట రుణాలు ( యాసంగిలో ) రూ.687 కోట్ల రుణాల లక్ష్యం కాగా, 468 కోట్ల రుణాలు అందించి 68 శాంతం లక్ష్యం సాధించడం జరిగిందన్నారు.  వానాకాలం (ఖరీఫ్) లో రూ. 1028 కోట్ల లక్ష్యానికి గా ఉ 813 కోట్ల రుణాలు అందించి 79 శాంతం లక్ష్యం సాధించామని తెలిపారు.  అగ్రి టర్మ్ లోన్ క్రింద రూ. 969 లక్ష్యానికి  గాను 610 కోట్ల రుణాలు అందించి 63 శాంతం, సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు రూ. 838 కోట్లకు గాను రూ. 534 కోట్ల రుణాలు అందించి 64 శాంతం లక్ష్యం సంధించడం జరిగిందని ప్రాధాన్యత రంగాలకు 3208 కోట్లు రుణాలు అందించి 69 శాంతం, ప్రధాన్యేతర రంగాలకు 789 కోట్లు రుణాలు అందించి 91 శాంతం లక్ష్యం సాధించడం జరిగిందన్నారు. 2022-23 సంవత్సరానికి గాను వార్షిక ఋణ ప్రణాళికను రూ. 6644 కోట్ల లక్ష్యంగా వార్షిక ఋణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు.  ప్రాధాన్యత రంగాలకు రూ. 5692 కోట్లు, ప్రధాన్యేతర రంగాలకు రూ. 952 కోట్ల చొప్పున మొత్తం రూ. 6644 కోట్ల లక్ష్యాన్ని 2022-23 సంవత్సరానికి నిర్దేశించినారు.  ఇందులో పంట రుణాల క్రింద రూ.2234 కోట్లు, వ్యవసాయ రుణాలు రూ. 3440 కోట్లు, చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలకు 1016 కోట్లు, విద్యా రుణాల క్రింద 151 కోట్లు లక్ష్యం నిర్దరేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.    పెండింగ్ లో ఉన్న యస్సి, యస్టి, మైనారిటీ రుణాలను బ్యాంకర్లు వెంటనే గ్రౌండింగ్ చేయాలనీ  కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. ఈ సందర్బంగా ఆర్ బి ఐ జియం  యశోద బాయి మాట్లాడుతూ డీసీసీ /డియల్ ఆర్ సి సమావేశాలు సకాలంలో జరపాలన్నారు.  బ్యాంకర్లు అందరు సకాలంలో క్వార్టర్లి రిటర్న్ లు అందజేయాలని, మొండి బకాయిల రికవరీ కొసం అధికారులు బ్యాంకర్లకు సహకరించాలని కోరారు.  గ్రామీణ బ్యాంకు శాఖలలో ప్రతి నెల విధిగా ఆర్థిక అక్షరాస్యతపై సమావేశాలు నిర్వహించాలని కోరారు. అనంతరం ఆర్బిఐ జియంతో  కలసి కలెక్టర్ 2022-23 వార్షిక ఋణ ప్రణాళిక బుక్లేట్ ను ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమంలో యల్డియం రాంబాబు, ఆర్బిఐ యల్డిఓ పూర్ణిమ, నాబార్డ్ డిడియం ప్రవీణ్ కుమార్, SBI RM శ్రీ రామ కృష్ణ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ RM సయ్యద్ యూసఫ్ అలీ, ఏపీజీవీబీ RM సుభాష్, DRO విజయకుమారి, GM ఇండస్ట్రీస్ వినయ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, హార్టికల్చర్ అధికారి చక్రపాణి, సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area