సోదరి జ్ఞాపకార్థం గా పండ్లు పంపిణీ చేసిన వైద్యుడు రాజారమేష్

Published: Friday April 30, 2021

క్యాతనపల్లి, ఏప్రిల్ 29, ప్రజాపాలన ప్రతినిధి : పురపాలక సంఘం సింగరేణి ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రాజారమేష్ సోదరి జ్ఞాపకార్థం గురువారం పండ్లు పంపిణీ చేశారు. ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు, కోవిడ్ పరీక్షలకు వచ్చిన వారికి, వ్యాక్సిన్ తీసుకునే కార్మికులకు, కార్మికేతరులకు సోదరి గొడిశాల సురేఖా రాజ్ జ్ఞాపకార్థం పండ్లు, పండ్ల రసం పంపిణీ చేసి స్మరించుకున్నారు. అనంతరం వైద్యడు రాజారమేష్ మాట్లాడుతూ సోదరి మరణానంతరం జ్ఞాపకార్థంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు. మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా రోగుల సహాయార్ధం 30 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. సిసి నస్పూర్లోని శ్రీసాయి వృద్ధాశ్రమంలో 25 మంది వృద్ధులకు మధ్యాహ్న భోజనం, మానసిక వికలాంగుల ఆశ్రమంలో 13 మందికి, అనాధాశ్రమంలో మరికొంత మందికి సోదరిని స్మరించుకుంటూ అన్నదానం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, మురళి, కన్న, వెంకన్న, బద్రి, కిరణ్, హర్ష రాజు, ప్రసాద్, కుమార్, ప్రవీణ్, శివ, శ్రీధర్, రాజయ్య, గట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.