బాణామతి పై అవగాహన సదస్సు

Published: Friday October 29, 2021
ఎర్రుపాలెం అక్టోబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు గ్రామ పంచాయతీ నందు బాణమతి అనే అపోహతో భయబ్రాంతులకు ప్రజలు ఉన్న సందర్భంలో మంగళవారం రాత్రి ప్రజలకు అవగాహన సదస్సును మండల ఎస్సై ఉదయ్ కిరణ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతబడి బాణామతి అనేది ఏమీ లేవని, ఆకతాయిలు నిమ్మకాయలు, కోడిగుడ్లతో ప్రజలు భయపడుతున్నారని అటువంటి వారిని గుర్తించామని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అటువంటి పనులు చేసేవారు మానుకోవాలని, లేనిపక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, ట్రైన్ ఎస్ఐ వెంకటేష్ నాయుడు, సొసైటీ చైర్మన్ శీలం అక్కిరెడ్డి, వీరారెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.