కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న ఇసుక మాఫియా కాంట్రాక్టర్ల. పై చర్య త

Published: Friday July 01, 2022
కరీంనగర్ జూన్ 30 ప్రజాపాలన ప్రతినిధి :
 
 నిబంధనలకు వ్యతిరేకంగా
జిల్లా వ్యాప్తంగా అక్రమంగా
 ఇసుక తరలిస్తున్న  మాఫియా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్
 డిమాండ్ చేశారు.
గురువారం నాడు జరిగిన ఆర్పీఐ పార్టీ జిల్లా ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ
రాష్ట్రాన్ని సాధించుకున్నది
ఇందుకోసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నీళ్లు నిధులు ,నియామకాలు కోసం
పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా
తరువాత ప్రకృతి వనరులను బడా వ్యాపారులకు కొందరు ఉన్నతాధికారులు దోచిపెడుతున్నారని,
అందులో భాగంగానే మానేరు నదిలో
ఇసుకను తోడుకునిపోవాడానికి పథకం ప్రకారం చెక్ డ్యాం
కాంట్రాక్టరుతో కుమ్మకైన
జిల్లా ఉన్నంత అధికారులు నాసిరకం
చెక్ డ్యాంలు నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇలాంటి అవినీతి కాంట్రాక్టర్లపై
చర్యలు తీసుకోవాలని కోరారు.  దీనికి తోడు
అధికారులు తప్పుడు నివేదతో 
చెక్ డ్యాం లోపల ఇసుక పేరుకుపోయిందని, దీని వల్ల నీటి సామర్థ్యం
పెరగదని అందువల్ల రెండు కిలో మీటర్ల
వరకు ఇసుకను తొలగించాలని సంబంధిత ఉన్నతాధికారులు అబద్ధపు నివేదిను
రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారన్నారని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రభుత్వ రోడ్ల కోసమని
ఇసుక క్వారీలు ఇస్తున్న ఆదేశాలను
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మానేరు నదిలో ఇసుకను తోడి బొందల గడ్డగా మార్చాలని పథకం పన్నారని
ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను తీయడం
వల్ల భూగర్భజలాలు అడుగంటి పోతాయని
బోర్లు ఎండిపోతాయని భారీ ఇసుక లోడుతో
ప్రజల ధనంతో నిర్మించిన రోడ్లన్ని ధ్వంసం
అవుతున్నాయన్నారు.
 రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటం కాకుండా
దుమ్ము ,దూళి వల్ల నిరుపేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారని,దీనితో అనేక మంది
అనారోగ్యాలపాలు అవుతున్నారన్నారు. ఇలాంటి ‌వాచికి అనుమతులు ఇవ్వరాదని రైతులు కలెక్టరుగారికి మైనింగ్ అధికారులకు
ఏన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికి
భారీ ఇసుక లోడ లారిలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ
అధికార పార్టీ లోకల్ నాయకులతో ఒప్పందం
చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఇసుక కాంట్రాక్టర్స్ ఇసుకను తీయడంతో చాలా గ్రామాల ప్రజలు
ఆందోళనలకు గురి అవుంతున్నారన్నారు.
రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తోన్న
ఇసుక అక్రమ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం
వెంటనే చర్యలు తీసుకోవాలని. రైతులను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తు
ఇసుక తీసుకోవటానికి
అనుమతులు ఉన్నాయంటూ అక్రమంగా
ఇసుకను తీయడంతో మానేరు ఒడ్డున ఉన్న కనగర్తి మడుక.ఇందుర్తి విలాసాగర్ గుంపుల. కిష్టంపేట.ముత్తారం.ఓడెడ్ ఖమ్మంపల్లి
ఓదాల గ్రామాలతో పాటు చాల గ్రామాలో ఇసుక తీయడం వల్ల మానేరు నదిలో
భూగర్భ జలాలు అడుగంటి పోతాయని బోర్లు ఎత్తిపోతాయని మోటారులు పైపులు కొట్టుకుని పోతున్నాయని, పంటలు పండకండా గ్రామలన్ని బొందల గడ్డగా మారేప్రమాదం ఉంగన్నారు. అందువల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకొనే అవకాశం ఉందని, కనుక ఇసుక తీయవద్దని
రైతులు ప్రజలు ద్వారా
రాష్ట్ర కమిటీ ద్వారా మైనింగ్ శాఖకు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ఆందోళనలు నిరహార దీక్షలు చేస్తున్నప్పటికి ఇసుక మాఫియా, మైనింగ్ అధికారులు ,
ఇసుక మాఫియా కాంట్రాక్టర్లకు అమ్ముడుపోవడంతో ఇసుకను
తీసుకుని పోతున్నారని
 ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తీయవద్దని అడ్డుకున్న రైతులపై
పోలీసులు అరెస్టులు చేస్తూ బెదిరిస్తూ గురి చేస్తు కేసులు పెడుతున్నారని, రైతులను ప్రజలను బెదిరిస్తూ నోర్లు మూయిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని లేకుంటే
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
అధ్వర్యంలో ప్రజలతో
భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని
రాష్ట్ర అధ్యక్షులు కుతాడి శివరాజ్ యొక్క ప్రకటనలో డిమాండ్ చేశారు.