పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

Published: Saturday June 18, 2022

 మధిరజూన్17 ప్రజాపాలన ప్రతినిధిమున్సిపాలిటీ లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గౌతమ్.తొలుత  మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ గౌతమ్.మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ గౌతమ్.ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్మాణం చేపడుతున్న వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గౌతమ్.మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత ను అభినందించిన జిల్లా కలెక్టర్ గౌతమ్. మధిర మున్సిపాలిటీ లో జరుగుతున్న కార్యక్రమాలు పరిశీలించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ గౌతం మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న పనులు మరియు ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ చాలా బాగుందని మెచ్చుకొని మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత  కి కరచాలనం చేసి అభినందించిన జిల్లా కలెక్టర్ గౌతం. ఈ విధంగానే ముందుకెళ్లండి అభివృద్ధికి కృషి చేయమని కలెక్టర్ వారి సూచించారు. వారితో పాటు కమిషనర్ రమాదేవిని మరియు AE నరేష్ రెడ్డి ని మున్సిపల్ అధికారులను కలెక్టర్ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.