సమిష్టిగా కృషి చేస్తేనే జిల్లాను అభివృద్ధి. .జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

Published: Friday February 03, 2023
మంచిర్యాల బ్యూరో, ఫిబ్రవరి 02, ప్రజాపాలన.
 
 
జిల్లాను అభివృద్ధి పథంలో  ఉంచేందుకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమితో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, రెవెన్యూ అధికారులతో అభివృద్ధి పనులనుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో చేపట్టి పురోగతిలో ఉన్న పనులను 100 శాతం పూర్తి చేసే విధంగా దృష్టి సారించాలని, కష్టపడి పని చేసి లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. విధుల పట్ల పూర్తి నిబద్దతతో వ్యవహరించాలని, నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుకు అధికార యంత్రాంగం సమన్వయంతో అందరి సహకారంతో పని చేయాలని, నిర్దేశిత లక్ష్యాల సాధనలో తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు. . ప్రభుత్వం చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమం మొదటి విడతలో జిల్లాలో ఎంపికైన 248 పాఠశాలలలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, 36 పాఠశాలలను ప్రారంభానికి సిద్ధం చేయడం జరుగుతుందని, 22 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, అన్ని పనులు పూర్తి చేసిన పాఠశాలలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. . ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.