కరోనా బాధితులకు రైల్వే సిబ్బంది ఆపన్న హస్తం

Published: Monday May 17, 2021
మధిర, మే16, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలో ఉదయం 9 గంటలకు కరోనా లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ ఆజాద్ రోడ్డు లో ప్రముఖ సామజిక సేవకుడు ఆరోగ్య పరివేక్షకుడు లంకా కొండయ్య సూచించి ఏర్పాటు చేసిన కరోనా హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకొన్న మధిర ప్రాంతం కరోనా బాధితులుకూ మధిర సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే విభాగం రైల్వే సిగ్నల్ సిబ్బంది దాత్రుత్వంతో మానవ సేవే మాధవ సేవ గా భావించి ఒక్కొక్క కుటుంబానికి  ఒక నెలకు సరిపడా కిరాణా సరుకులు, బియ్యం, N 95 మాస్క్ లు, శానిటైజెర్ లు మొత్తం 12 మందికి లంకా కొండయ్య నివాస ప్రాంగణంలో కొండయ్య చేతులు మీదగా పంపిణి చేసినారు. రైల్వే సిగ్నల్ సిబ్బంది ఐన రైల్వే కృష్ణా సతీష్ గారు రవిగారు  మాట్లాడుతూ రోగి కార్చే కన్నీటి బొట్టు సప్త సముద్రంలొని నీటికంటే విలువైనది* అని స్వామి వివేకానంద చెప్పారు అని, ఆ ప్రకారమే బాధలో ఉన్న అభాగ్యులను కొండయ్య గారి ద్వారా గుర్తించి మానవత్వం తో ఈ కార్యక్రమం చేపట్టటం జరిగినది అనివారు తెలిపారు. ఇలాంటి సహాయ సేవా కార్యక్రమంలకు ముందుకు వచ్చిన రైల్వే సిగ్నల్ సిబ్బంది బృందంనకు కొండయ్య హృదయ పూర్వకoగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లంకా సేవా ఫౌండేషన్ వాలంటీర్లు లంకా కరుణ లియోనా, ఏ వెంకటేష్  అంజి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.