కెసిఆర్ పథకాలతో రైతులకు మేలు

Published: Thursday October 07, 2021
రైతన్న సినిమా ద్వారా రైతులకు వివరించిన నటుడు నారాయణమూర్తి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
మధిర, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి తీసుకొని వచ్చిన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని, ఈ చట్టాల వల్ల రైతులకు జరుగుతున్న నష్టాన్ని గురించి వివరించిన సినీ నటుడు ఆర్.నారాయణమూర్తిని టిఆర్ఎస్ పార్టీ తరపున అభినందిస్తున్నట్లు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తెలిపారు. ఈ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ సినిమా ద్వారా వివరించడం జరిగిందన్నారు. ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు. సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా అనేక నెలలుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. స్వామినాథన్ కమిషన్ కమిటీ సిఫార్సులను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు జిల్లా నాయకులు మల్లాది వాసు మండల పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాస రావు కనుమూరి వెంకటేశ్వర రావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు చావా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.