ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి *రైతుబంధుతో అన్నదాతల కుటుంబాల్లో ఆనందం*

Published: Wednesday December 28, 2022

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేబట్టిన రైతుబంధు పథకం ద్వారా అన్నదాతల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసిందని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అద్యక్షుడు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తొమ్మిదవ విడత రైతుబంధు పథకం డబ్బులు నేటి నుండి నేరుగా రైతుల ఖాతాల్లో జరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఈ యాసంగి కాలం పంట పెట్టుబడి కోసం ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన 55217 మంది రైతులకు 61.52 కోట్ల నిధులను కెసిఆర్ ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు. ఎకరా రైతులనుండి మొదలుకొని దశలవారిగా రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం జమకానున్నదని అన్నారు. గడిచిన ఎనిమిది విడతలలో నియోజకవర్గంలోని 56వేల రైతుకుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 457.61 కోట్ల రూపాయల రైతుబంధు పంట పెట్టుబడి సాయం అందజేసిందని ఎమ్మెల్యే వివరించారు. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా  కేసీఆర్ అన్నంపెట్టి రైతన్నకు పంట పెట్టుబడి సాయం అందజేసి రైతుజనబాందవుడిగా కర్షకుల గుండెల్లో చిరస్థానం సాదించాడని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. కేంద్రంలోని కదిపి ప్రభుత్వం తెలంగాణను న్యాయబద్ధంగా రావలసిన నిధులను నిలిపివేసినా కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నదని చెప్పారు. ఈ యాసంగిలో ఇబ్రహింపట్నం మండలానికి చెందిన 16925 మంది రైతులకు 17.48 కోట్లు, అబ్దుల్లాపూర్మెట్టు 9468 రైతులకు 8.19 కోట్లు, మంబాల 14865 రైతులకు 16.17 కోట్లు, యాచారం మండలం 14 5189 రైతులక 19.68 కోట్లు పంటపెట్టుబడి సాయం బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. జిల్లా రైతుబంధు అద్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి,  జిల్లా గ్రంథాలయ  సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మండల పార్టీ అద్యక్షులు చిలుకల బుగ్గరాములు, చీరాల రమేష్, కర్నాటి రమేష్ గౌడ్, కొత్త కిషన్ గౌడ్, ఎంపిపిలు కృపేష్, నర్మద,జెడ్పిటిసి
జంగమ్మలు ఉన్నారు.