ఈ కేవైసీ, బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ అనుసంధానం తప్పనిసరి: మండల వ్యవసాయ అధికారి అబ్బూరి శరత్ బాబు

Published: Wednesday April 27, 2022
బోనకల్, ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం రైతుల కొరకు ఎన్నో రకాల పథకాలు అందిస్తుందని, అన్నదాతల కోసం కొన్ని స్కీములు అందుబాటులోకి వచ్చాయని, వీటిలో పీఎం కిసాన్ స్కీం అనేది ముఖ్యమైనదని బోనకల్ మండల వ్యవసాయ అధికారి అబ్బూరి శరత్ బాబు అన్నారు. పి ఎం కిసాన్ నగదు తమ ఖాతాలో జమ కావాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని, కావున తమ బ్యాంకు ఖాతాను ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేసుకోవాలని ఆన్నారు. రైతులు ఎక్కడైతే పీఎం కిసాన్ జమ చేయ దలచిన బ్యాంకు కి వెళ్లి ఆధార్ అనుసంధానం చేసుకోవాలని, పీఎం కిసాన్ ఈ కేవైసీ ధృవీకరణను రైతులు యాప్ ద్వారా గాని, పీ ఏమ్ కిసాన్ పోర్టల్ లో కానీ ఉచితంగా చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ విధంగా చేసుకుంటే ఫోన్ ద్వారా ఓటిపి వెళ్తుంది కావున రైతులు మీ మొబైల్ ఫోన్ ని ఖచ్చితంగా దగ్గర ఉంచుకోవాలని, లేదా కామన్ సర్వీస్ సెంటర్ లలో బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చునని, అందువలన ఈ కేవైసీ ఆధార్ అనుసంధానం మే 31 లోగా పూర్తి చేసుకోవాలని లేనియెడల పీఎం కిసాన్ నగదు తమ ఖాతాలో జమ కాదని, రైతులందరూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి రైతులను కోరారు.