తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి

Published: Thursday February 10, 2022
కోటపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్
వికారాబాద్ బ్యూరో 09 ఫిబ్రవరి ప్రజాపాలన : పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచారని కోటపల్లి మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ విమర్శించారు. బుధవారం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు కోటపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వికారాబాద్ నియోజకవర్గం కోట్ పల్లి మండల కేంద్రంలో పాడే మోస్తూ... కోట్ పల్లి బస్టాండ్ ఎదురుగా బిజెపి పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కోటపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ మాట్లాడుతూ లోక్ సభ తలుపులు మూసి మైకులు కట్ చేసి రాష్ట్ర విభజన చేశారని ప్రధాని మోడీ వ్యాఖ్యలు అర్థరహితమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నది కాంగ్రెస్ బిజెపి పార్టీలేనని గుర్తు చేశారు. తల్లిని చంపి పిల్లకు న్యాయం చేశారని మోడీ వ్యాఖ్యలు హేయమైనవని తూలనాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సీఎం కేసీఆర్ చావు అంత లోకి వెళ్లి సాధించుకున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలేదని కెసిఆర్ పోరాడి సాధించుకున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి ఏఎంసి చైర్మన్ మహేందర్ ఏం సి వైస్ చైర్మన్ దశరథ్ గౌడ్ రైతుబంధు అధ్యక్షుడు సత్యం సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ నరసింహులు, బీసీ సెల్ అధ్యక్షుడు జనార్ధన్, మాజీ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు బందయ్య వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఉపసర్పంచ్ మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు యువజన సంఘాల నాయకులు మహిళలు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.