జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని టిడబ్ల్యూజేఫ్ ఆధ్వర్యంలో భద్రాచలంలో జరిగిన రెండో జిల్

Published: Saturday December 10, 2022
.జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, జర్నలిస్టు బంద్, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యని ఇవ్వాలంటూ శుక్రవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టీ డబ్ల్యూ జె ఎఫ్ ) రెండవ జిల్లా కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం భద్రాచలంలోని జిల్లా కార్యాలయంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ కర్ర అనిల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు పూదోట సూరిబాబు, గుండెబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పోరాటంలో జిల్లాలో ముందుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు డి రవికుమార్, సైదయ్య, రమేష్, సభ్యులు ఏడెల్లి గణపతి, హరీష్, మధులిక తదితరులు పాల్గొన్నారు.