యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : తహశీల్దార్ రవీందర్, ఎస్సై రాజు నాయక్

Published: Monday October 04, 2021
మల్లాపూర్, అక్టోబర్ 03 (ప్రజాపాలన ప్రతినిధి) : యువత గంజాయి వ్యసనానికి బానిసలు కాకుండా తమ బంగారు భవిష్యత్తు పై దృష్టి సారించి సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఎస్సై రాజు నాయక్ కోరారు. మల్లాపూర్ మండలం వెంపెల్లి వెంకట్రావు పేట్ గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం యందు యువకులు, మైనర్లు గంజాయి మత్తుకు దూరంగా ఉండాలని యువత చేడు మార్గాల వైపు వెల్లదని మండల తహశీల్దార్ రవీందర్, ఎస్సై రాజు నాయక్ లు కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మత్తు పదార్థాలను వినియోగించడం ద్వారా కలిగే అనర్ధాల గురించి యువతకు వారి తల్లిదండ్రులకు  అవగాహన కల్పిస్తూ, తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ చెడు మార్గంలో ప్రయాణించకుండా చూస్తూ బంగారు భవిష్యత్తుకు భాటలు వేయాలని కోరుతూ, గంజాయి అక్రమ రవాణాను ఎవరు కూడా ప్రోత్సహించరాదని,  గంజాయిని ఎవరైనా సరాఫరా చేస్తే పోలీస్ సిబ్బందికి  అందజేయాలని, గంజాయి సరఫరా చేసే వారు ఎవరైనా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తహశీల్దార్ మాట్లాడుతూ గ్రామాల్లో ఇసుక గురించి ప్రయివేట్ వ్యక్తులు ఎవరైనా వేలం నిర్వహించరాదని ఒక వేళ ఎవరైనా అట్టి కార్యక్రమాలు నిర్వహిస్తే వారి వివరాలు తెలుపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బిట్ల సరోజన - నరేష్, జోగుల మమత - రాజేష్, ఎంపిటిసిలు తోట సుజాత - శ్రీనివాస్, గుగ్లవాత్ భూమి - రాజేందర్ గ్రామంలోని యువకులు పాల్గొన్నారు.