గ్రామపంచాయతీ నిధుల మళ్లింపు, దుర్వినియోగంపై ఎంపీడీవో కు ఫిర్యాదు

Published: Tuesday July 12, 2022

బోనకల్ , జులై 12 ప్రజాపాలన ప్రతినిధి:మండల పరిధిలోని రాపల్లి గ్రామ పంచాయితి నిధులను ప్రైవేటు వ్యక్తులకు మళ్లింపు, దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని రాపల్లి గ్రామానికి చెందిన ప్రజలు సోమవారం ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో ఆమెకు వినతి పత్రం అందజేశారు. గత మూడేళ్లుగా (2019 నుంచి) గ్రామ సర్పంచ్ మందడపు తిరుమలరావు గ్రామ ప్రజలకి పంచాయితీ లెక్కలు చెప్పటం లేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. మూడేళ్ల నుంచి గ్రామ పంచాయితికి సంబందించిన జనరల్ ఫండ్, స్టేట్ ఫైనాన్స్, సెంట్రల్ ఫైనాన్స్ నిదులు పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యక్తులకు బాదలాయించాడని పేర్కొన్నారు. దీనికి తోడు పెద్ద ఎత్తున నిధులను సర్పంచ్ దారి మళ్ళించాడని,గ్రామపంచాయతీ నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి గ్రామపంచాయతీకి న్యాయం చేయాలని మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులకు అందజేయనున్నట్లు వారు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఏనుగు రవికుమార్, తోట చలపతి, ఏనుగు సందీప్, మోదుగు శివకృష్ణ, ఏనుగు శంకర్రావు, తాళ్లూరి వినోద్ కుమార్, రాచకొండ కృష్ణయ్య, తాళ్లూరి వినయ్ కుమార్, చల్ల గోపాలకృష్ణ, గంగాదేవుల లింగయ్య, నల్లమల నాగేశ్వరరావు, చల్లా బాబురావు, బెజవాడ నాగరాజు, మోదుగు సైదులు, బెజవాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.