*రైతులపై చిన్నచూపా? రైతును కాపాడుకుంటేనే మనిషి మనుగడ** -రైతు వ్యతిరేకి' మోడీ దిష్టిబొమ్మ దాహ

Published: Saturday December 24, 2022
కేంద్ర ప్రభుత్వ "రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా,తెలంగాణ ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేవెళ్ల మండల కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరై మాట్లాడుతూ...
బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అనుకరిస్తుందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలోని రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సందర్భాలు  చాలా ఉన్నాయి. రైతులు ఢిల్లీ వేదికగా కేంద్రప్రభుత్వం నల్లచట్టలను చేస్తే యావత్తు దేశ రైతులు అందరూ కలిసి ఢిల్లీని దిగ్బంధం చేసి కనీసం 16నెలలు చలికి వణుకుతూ , వానకు తడుస్తూ ఎండకు ఎండి కనీసం 700మంది రైతుల చావులను చూసింది ఈ కేంద్ర ప్రభుత్వం అయినా కూడా పట్టుసడలకుండా పోరాటం చేసి నల్లచట్టలను రద్దు చేసే వరకు పోరాటం చేసిన చరిత్ర ఈ దేశ రైతులది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నుండి మొదలు నేటి వరకు రైతుల పొట్టకొట్టి కార్పొరేట్ దారులకు రెడ్ కార్పెట్ వేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశ రైతులే గోరి కడుతరని ఎమ్మెల్యే  హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర
రైతు బాంధవులు , రైతును రాజు చెయ్యడంలో సఫలీకృతం అయినా రైతు నేస్తం తెలంగాణ జాతిపిత బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం అనునిత్యం ఆలోచన చేస్తూ "రుణమాఫీ,రైతు బంద్ , రైతు భీమా ,24 గంటల ఉచిత కరెంట్,ఉచిత ఎరువులు , ఇస్తూ... "దేశవ్యాప్తంగా "ఆఫ్ కీ బార్ కిసాన్ సర్కార్ పేరుతో దేశంలో రైతు పాలన కావాలి అని కోరుకుంటున్న మహోన్నతమైన నేత మన కేసీఆర్. నేడు రైతుల కోసం కల్లలు ఏర్పాటు చేసుకుంటే "ఉపాధి హామీ పథకంలో డబ్బులను వృధా చేశారు అని "సోషల్ ఆడిట్" అనే పేరుతో ఒక దుర్మార్గపు ఆలోచనలతో అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రాన్ని అబసుల పాలు చేస్తూ... మళ్ళీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిరూపించుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని బొంద పెడతాం అని అన్నారు*
ఈ కార్యక్రమంలో షాబాద్ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మిట్ట వెంకట రంగారెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మర్పల్లి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, ఏఎంసి వైస్ చైర్మన్ నర్సింలు, ఇంద్రన్న యువసేన నాయకులు రవికాంత్రెడ్డి,రవీందర్,, రామా గౌడ్, నాగార్జున రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శేరి శివారెడ్డి, మద్దేల చింటూ,ఏఎంసి డైరెక్టర్ ఫయాజ్,గని, శేఖర్, మొయినాబాద్ టిఆర్ఎస్ నాయకులు షాబాద్ టిఆర్ఎస్ నాయకులు వివిధ మండల తెరాస నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.