పెండింగ్ డిఏ లు చెల్లించండి

Published: Monday July 18, 2022

కోరుట్ల, జూలై 17 (ప్రజాపాలన ప్రతినిధి):
రాష్ట్ర ప్రభుత్వం జూలై 2021 నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు బకాయిపడి చెల్లించాల్సిన మూడు పెండింగ్ డీఏ లను తక్షణం చెల్లించాలని టిఆర్టిఎఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రావికంటి పవన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల కోవిడ్ విపత్కర పరిస్థితిలు, భారీగా పెరిగిపోయిన గృహ నిర్మాణ, విద్య, వైద్య సంబంధిత ఫీజులు, ఇతర అత్యవసర ఖర్చులను దృష్టిలో పెట్టుకొని డిఎ కన్వర్షన్ ఫ్యాక్టర్ సి.ఫ్ ప్రకారం 10.01% డి ఏ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పవన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోవిడ్ ప్రతికూల పరిస్థితుల కారణంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఉద్యోగ , ఉపాధ్యాయుల కనీస జీవన ప్రమాణ స్థాయి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణం స్పందించాలని పవన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టిఆర్టిఎఫ్ జగిత్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుంగూరి సురేష్, గుర్రం శ్రీనివాస్ గౌడ్, గంగుల రణధీర్, చౌడారపు రాంప్రసాద్, భేతి సాయి కృష్ణ, తూడూరి సతీష్ గౌడ్, కోటగిరి హరీష్, గుండ శ్రీనివాస్, సుంకిశాల ప్రభాకర్ రావు, కోరుట్ల రాజ్ కుమార్, యాగండ్ల గంగాధర్, రాజ్ కిషోర్, లక్ష్మీకాంతం, రంగు రమేష్, నీరజ, సమీరా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.