వయోవృద్ధుల పట్ల ప్రేమ, అప్యాయతలు కలిగి ఉండాలి. ..వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ .

Published: Thursday June 16, 2022

..వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వయోవృద్ధులకు సత్కారం                

 
మంచిర్యాల బ్యూరో, జూన్15,    ప్రజాపాలన : 
 
వయోవృద్ధుల ను ప్రేమ ఆప్యాయతలతో వారి శేష జీవితాలను గడిపే విదంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ అన్నారు.  ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మంచిర్యాల వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని మంచిర్యాల డే కేర్ సెంటర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వయోవృద్ధుల ను మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్ , రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్, జోన్ ఛైర్మన్ కాచం సతీష్, వాసవి క్లబ్ అధ్యక్షులు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి  నలుమాసు ప్రవీణ్, వనితాక్లబ్ అధ్యక్షురాలు గౌరిశెట్టి ధనలక్ష్మి,  మంచిర్యాల జిల్లా వయోవృద్ధుల సమాఖ్య అసోసియేట్ ప్రెసిడెంట్ మహేందర్ రాజు , ప్రధాన కార్యదర్శి సయిండ్ల మొండయ్య , హనుమంతరావు రాజిరెడ్డి, చందూరి ప్రభాకర్ ,  ప్రభాకర్, పాపా రావు  తదితరులు పాల్గొన్నారు