వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

Published: Thursday April 21, 2022
జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్
వికారాబాద్ బ్యూరో 20 ఏప్రిల్ ప్రజాపాలన : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్న సందర్బంగా చౌకధరల దుకాణాలలో ఉన్న ఖాళీ గొనె సంచులను వెంటనే స్థానిక పౌర సరఫరాల శాఖ గోదాముల్లో అప్పగించాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, ప్రస్తుతం యాసంగి వరి ధాన్యం కొనుగోలు కొరకు గొనె సంచుల కొరత ఏర్పడినందున, రేషన్ దుకాణాల వద్ద ఉన్న గొనె సంచులను వెంటనే అందజేయాలని, లేదంటే చర్యలు తప్పవని డీలర్లకు స్పష్టం చేసారు. ఇట్టి గొనె సంచులను రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాలలో వినియోగించడం జరుగుతుందన్నారు. ఇట్టి సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, డిప్యూటీ తహసీల్దార్లు, కాంట్రాక్టర్లు, సివిల్ సప్లై సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.