యాసంగిలో ప్రత్నామ్యాయ వంటలు వేసుకోవాలి : జిల్లా కలెక్టర్ భారతీహోళికేరి

Published: Saturday December 18, 2021
జన్నారం రూరల్, డిసెంబర్ 17,  ప్రజపాలన : యాసంగిలో వరికి బదులుగా ప్రత్నామ్యాయ పంటలు సాగు చేసుకోవాలని జిల్లా మంచిర్యాల కలెక్టర్ బారతిహోలికేరి సూచించారు, శుక్రవారం జన్నారం గ్రామంలో ఎర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో మాట్లాడారు, యాసంగిలో వచ్చిన వరి పంటకు కోనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు సైతం కోనుగోలు చేసేందుకు సుముఖంగా లేకపోవడంతో రైతులు అలోచించి తగిన  నిర్ణయం తీసుకోవాలని కోరారు, వరికి బదులుగా తక్కువ నీటితో సాగుచేసే మినుము, వేరు శేనగ, మెుక్కజోన్న మరియు పెసరు తదితర అరువది పంటలను సాగు చేసుకోవా లన్నారు, ఒక వేళ వరిని సాగు చేసుకుంటే రైతులే మార్కెటింగ్ చేసుకోవాలని రైతులను కోరారు, ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చరల్ అపీసర్ వినోద్ కుమార్, తహసీల్దార్ పుష్పలత, ఎంపిపి మాదాడి సరోజన, ఎంపిడిఓ  అరుణారాణి, ఎవో సంగిత, ఏఈఒలు త్రీసంధ్య, అక్రము, జన్నారం సర్పంచ్ గంగదర్ గౌడ్, ఎంపిటీసి రీయాజుద్దీన్, ఉప సర్పంచ్ జంగం మల్లేష్, గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.