యోగ నిత్యా జీవితం లో ఓ భాగం చేసుకోవాలి:ఉపాధ్యాయుడు సత్యం పైసా

Published: Monday June 21, 2021

బొల్లారం, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి : జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని చిన్న పిల్లల నుండి ముసలి వరకు ప్రతి ఒక్కరు యోగాతో మనసు, శరీరాన్ని జయించవచ్చని జిన్నారం మండలం బొల్లారం గణిత ఉపాధ్యాయులు సత్యం పైసా అభిప్రాయ పడ్డారు... ఆయన మాట్లాడుతూ అతి ప్రాచీనమైన మన భారతీయ యోగా సంస్కృతి ఇపుడు ప్రపంచ దేశాలన్నీ అలవాటుగా చేసుకోవడం మనకు గర్వకారణమని మన భావి తరాలకు తప్పక యోగా, ధ్యానం యొక్క విశిష్టతను అందజేయాలని ఆయన అన్నారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా బడులు మూత పడటంతో పిల్లలకు డైరెక్ట్ గా యోగ నేర్పించడం కష్టమైనందని, గత వారం రోజులుగా ప్రతిరోజు సామాజిక మాధ్యమాల ద్వారా మరియు సాయంత్రం జూమ్ క్లాసులు నిర్వహించి యోగ గొప్పదనాన్ని వివరిస్తూ సూర్య నమస్కారాలు, ధ్యానం నేర్పిస్తూ, నవ్వు ఒక భోగం అని మనస్ఫూర్తిగా నవ్వగలిగినపుడు ఏ రోగం మన దరి చేరదు అని లాఫింగ్ థెరపీ ని నేర్పిస్తూ, ఆనందలహరి డాన్స్ ప్రోగ్రాం ద్వారా పిల్లల్లో ఆత్మ న్యూనతా భావం పోగొడుతూ, కరెంట్ షాక్ తో రెండు చేతులు కోల్పోయినా అద్భుతమైన చిత్రలేఖనం వేస్తూ, డాన్సులు చేస్తూ యోగాసనాలు వేస్తున్న స్వప్నని, సంగారెడ్డి NGC కో ఆర్డినేటర్ మాధవరెడ్డిని, జీవన మంత్ర యోగా నరేష్ గురులను జూమ్ కి ఆహ్వానించి వందల మంది పిల్లలకు, పెద్దలకు ఈ యోగా దినోత్సవం పురస్కరించుకుని అవగాహన కల్పిస్తున్న సత్యం పైసాని పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.. విరాట భారతి వారు నిర్వహిస్తున్న యోగా సప్తాహ్ లో భాగంగా కోటి సూర్య నమస్కారాలలో తనతో పాటు పిల్లలు పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ ప్రేరణ తో జీవితాంతం యోగాని జీవితంలో ఒక భాగం చేసుకోవాలని మున్ముందు కరోనా లాంటి ఎంత ప్రమాద మహమ్మారి వచ్చినా మన ఇమ్యూనిటీ తో ఎదురించాలని సూచించారు.