భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేనిదే మనం లేము

Published: Friday February 04, 2022
ఇబ్రహీంపట్నం పిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి : భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ రచయిత బాబా సాహెబ్ అంబెడ్కర్ గారిని అవసమాన పరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తుర్కయంజాల్ కూడలి వద్ద నున్న డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహానికి పాలాభిషేకంతో పాటు భీం దీక్ష బిజెపి ఎస్సిమోర్చా అధ్యక్షుడు బచ్చిగళ్ల రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగిందీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు పాల్గొన్న వనపర్తి జిల్లా ఇంచార్జి బోసుపల్లి ప్రతాప్ గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి అర్జున్ రెడ్డి గార్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖమంత్రి భారత రాజ్యాంగాన్ని మొత్తాన్ని మార్చాలనడం రాజ్యాంగాన్ని రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ గారిని అవమాన పరచడమే అని ఆయన అధికారం లోకి వచ్చిన ఈ 7 సంవత్సరాలలో కనీసం అధికారికంగా కానీ అనధికారికంగా కానీ జయంతి వర్ధంతి కి పూల మాలకుడా వేయని ఆయన ఇలా మాట్లాడడం చాలా విడ్డురామని, రాజ్యాంగ బద్ధమైన ముఖ్యమంత్రి హోదాలి ఉండి అలా మాట్లాడం తగదని అతని పైన దేశ ద్రోహం కేసు పెట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొత్త అశోక్ గౌడ్ రాష్ట్ర నాయకులు కొండ్రు పురుషోత్తం, సానేం అర్జున్ గౌడ్, నోముల కార్తిక్ గౌడ్, శ్రవణ్ కుమార్ గౌడ్, నల్లవెళ్లి నిరంజన్ రెడ్డి, జిల్లా బిజెపి కోశాధికారి కొత్త రాంరెడ్డి  మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు తూళ్ళ నర్సింహ గౌడ్ జిల్లా యువమోర్చా నాయకులు మల్లెల ప్రేమ్ సాయి మల్లెలు దేవేందర్, మాడుగుల బాలకృష్ణ గౌడ్ ప్రధాన కార్యదర్శి యంజాల శ్రీనివాస్ రెడ్డి నాయిని చంద్రమోహన్, దాసుగారి వెంకటేష్, కంచనాని దాస్, యువమోర్చా నాయకులు ఎలిమినేటి నర్సింహారెడ్డి విశాల్ గౌడ్ నిట్టూ శివ మారగౌని సునీత మల్లెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.