పార్లమెంట్ సాక్షిగా ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించినట్టే

Published: Thursday February 10, 2022
కాంగ్రెస్ నాయకులు బచ్చలకూరి నాగరాజు - జెర్రీపోతుల అంజనీ ...
పాలేరు పిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోడీ తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడం హెయమైన చర్యగా బావిస్తున్నాం అన్నారు. ఆయనను తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు నేలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు. ప్రధాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మోడీ దిష్టి బొమ్మకు శవ యాత్ర నిర్వహించి. నేలకొండపల్లి లోని  పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మను దహనం చేసారు. ఎనిమిది ఏండ్లుగా విభజన చట్టానికి తూట్లు పొడిచి  తెలంగాణ కి మొండి చెయి చూపించిన మోడీ ఇప్పుడు కేసీఆర్ తో కలిసి వీధి నాటకాలు ఆడుతున్నారని ఇద్దరు ఒక్కటే అని విమర్శించారు ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ అమరులు ఆత్మ బలిదానాలను కించపరిచేలాగా ఉన్నాయి అన్నారు. ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ని విమర్శించడం సిగ్గు చేటని అన్నారు యూపీఏ, ఎన్డీఏ పక్షాలను ఒప్పించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ విభజన జరగలేదు అంటున్న మోడీ ఇన్నేళ్లు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు మోడీ సభలో ఉండి ఉంటే తెలంగాణ వచ్చేది కాదేమో అని అన్నారు ఎనిమిది ఏండ్లుగా విభజన చట్టం పొందుపరచిన రాష్ట్రానికి రావాల్సిన ఆ ప్రయోజనాలపై సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరాటం చేయకుండా రాజకీయ లబ్ధి కోసం బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు దొంగ నాటకాలు ఆడుతున్నారని  ఆరోపించారు. విభజన సమయంలో కెసిఆర్ పార్లమెంట్లో లేరని రాష్ట్ర ఏర్పాటులో కెసిఆర్ పాత్ర ఏమీ లేదన్న విషయం టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ సేవాదళం కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జెర్రిపోతుల సత్యనారాయణ, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రీ పోతుల అంజని, నేలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు దోసపాటి శేఖర్, రేగూరి హనుమంతరావు, అనంతు సత్యనారాయణ, వడ్డే జగన్, జల్లిపల్లి నాగేశ్వరావు, పాలడుగు అప్పారావు, బచ్చలకూరి నాగేశ్వరావు, కందుల గురునాధం, ఎస్ కె యాకూబ్, గునగంటి కోటేశ్వరరావు, నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.