కరోనా ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ నాయకులు డా.కల్వకుంట్ల సంజయ్

Published: Wednesday May 19, 2021
కోరుట్ల, మే 18, (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజి కరోనా ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ నాయకులు డా.కల్వకుంట్ల సంజయ్ అనంతరం స్వంత నిధులతో 5 ఆక్సిజన్లతోకూడిన బెడ్లను సమకూర్చారు. ఈ సందర్బంగా డా.సంజయ్ మాట్లాడుతు కరోనా పట్ల ప్రజలు నిర్లక్ష్య ధోరణి వహించవద్దని, పాజిటివ్ వచ్చి ఇళ్లలో ఉండలేని పరిస్థితులలో ఉన్న వారి కోసం కోరుట్ల పట్టణంలో ఏర్పరిచిన ఐసోలేషన్ సెంటర్ ను అవసరార్థులు ఉపయోగించుకోవాలని, కోరుట్ల పట్టణ మరియు మండల గ్రామ ప్రజల సౌకర్యార్థం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడి కోరుట్ల ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారని, సెంటర్లో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని, ఐసోలేషన్ కేంద్రంలో చేరిన పేషంట్లకు ప్రభుత్వమే భోజన వసతి కల్పిస్తుందని, ఐసోలేషన్ సెంటర్లో చేరేవారు తమ ఆధార్ కార్డుతో వైద్యులను సంప్రదించాలని కోరారు. అలాగే సెంటర్లో అత్యవసరమైన వారి కొరకు ఆక్సిజన్ తో కూడిన ఐదు బెడ్లను అందుబాటులో ఉంచారు. కాగా ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్ లను డాక్టర్ సంజయ్ గారు తన మిత్రుల సహకారంతో అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ అన్నం లావణ్య అనిల్, జిల్లా రైతు సమన్వయ కమిటీ చైర్మన్ చీటీ వెంకట్రావు, జిల్లా సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, కోరుట్ల తహశీల్ధార్ నడిమెట్ల సత్యనారాయణ, మున్సిపల్ కమీషనర్ ఎండి అయాజ్, కోరుట్ల సిఐ రాజశేఖర్ రాజు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్, ఎస్సైలు సతీష్ కుమార్, రాజ ప్రమీల, మున్సిపల్ కౌన్సిలర్లు జిందం లక్ష్మీనారాయణ, సజ్జు, రెవెన్యూ, మున్సిపల్ గవర్నమెంట్ హాస్పిటల్ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు