.ర్యాంకుల కోసం వేధించడం తోనే బలవన్మరణానికి పాల్పడింది. ...ఐక్య విద్యార్థి సంఘాల చైర్మన్ చిప్ప

Published: Thursday February 16, 2023
మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 15, ప్రజాపాలన: శ్రీ చైతన్య కార్పొరేట్ కాలేజ్ విద్యార్థిని నిమ్మల రమాదేవి ని ర్యాంకుల కోసం వేధించడం తోనే బలవన్మరణానికి పాల్పడిందని , విద్యార్థిని మృతికి కారణమైన కళాశాల యాజమన్యం గుర్తింపు రద్దు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల చైర్మన్ చిప్పకుర్తి  శ్రీనివాస్ అన్నారు. బుదవారం  మంచిర్యాల జిల్లా కేంద్రంలో పాత్రికేయ సమావేశాన్ని  ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్ సందర్భంలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తూ సరైన భోజనం, వసతులు అందివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అంతే కాకుండా ఒకే రిజిస్ట్రేషన్ తో నాలుగైదు ప్రాంతాల్లో కళాశాలలు నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు  చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ కాలేజీ యాజమన్యాలు ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా వేధించడం వల్లే విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతూ తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిలిస్తున్నరని అన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఆయా యాజమన్యాలపై చర్యలు తీసుకోవడం లేదని, అధికారులకు విద్యార్థుల చావులు  పట్టవా అని ప్రశ్నించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి యాజమాన్యాల గుర్తింపు రద్దు చేసి, రమాదేవి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ కె సల్మాన్ పాషా,
పురేళ్ళ నితీష్, జి. సతీష్