సేంద్రియా ఎరువుల గురించి అవగాహనా సదస్సు లో పాల్గొన్న బూర్గంపాడు మండలం జడ్పిటిసి కామిరెడ్డి

Published: Wednesday November 30, 2022

బూర్గంపాడు మండలం ( ప్రజా పాలన)
ఈరోజు సోంపల్లి గ్రామంలో సేంద్రియ ఎరువుల గురించి గాదె నర్సిరెడ్డి  ఆధ్వర్యంలో అవగాహన సదస్సు  నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండలం జెడ్పిటిసి కామరెడ్డి శ్రీలత  మాట్లాడుతూ రైతులకు రసాయన ఎరువులకు సేంద్రియ ఎరువులకు  వ్యత్యాసాన్ని వివరించారు.
సేంద్రియ ఎరువులు ఉపయోగించడం వల్ల భూసారం దెబ్బతినకుండా ఉంటుందని వివరించారు., సేంద్రియ ఎరువులు ఉపయోగించటం వలన తక్కువ ఖర్చు తో వ్యవసాయం చేయటం సులభతరం అని వివరించారు సేంద్రియ ఎరువులు ఉపయోగించటం వలన అనారోగ్య పరిస్థితులు రాకుండా కాపాడుకోవొచ్చు అని తెలియజేసారు, ఈ కార్యక్రమం లో గాదె నరసిరెడ్డి ,  సోంపల్లి సర్పంచ్ రామజనేయులు ,మొరంపల్లిబంజార  ఉపసర్పంచ్ కైపు లష్మినారాయణ రెడ్డి  మోరంపల్లి బంజార వార్డ్ నెంబర్ పద్మ , ఎ డి  తాతరావు , సొసైటీ డైరెక్టర్  బత్తుల రామకొండారెడ్డి, తోకల అనిత ,  రైతు బందు కో ఆర్డీ నేటర్  మారం శ్రీనివాస రెడ్డి, గాదె ఉష్ శ్రీ ,ఏ ఈ వో లావణ్య, పొడియం నరేందర్, స్థానిక రైతులు, గ్రామస్తులు తదితరులు  పాల్గొన్నారు.