గిరిజన రిజర్వేషన్ పెంపుకై తాసిల్దార్ కు వినతి పత్రం : భారతీయ గిరిజన మోర్చా నాయకులు

Published: Thursday May 19, 2022
బోనకల్, మే 18 ప్రజాపాలన ప్రతినిధి: స్థానిక మండల కేంద్రంలో బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదేశానుసారం, జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు రవి రాథోడ్ సూచన మేరకు మోర్చా మండల అధ్యక్షుడు భూక్య సైదా ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షుడు వీరపనేని అప్పారావు అధ్యక్షతన స్థానిక తహసీల్దార్ కి గిరిజన రిజర్వేషన్ పెంపు కొరకై వినతి పత్రం ఇవ్వడం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ 12% వెంటనే పెంచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న యువనేత బీపీ నాయక్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ ఇస్తామన్న మాటలు నమ్మబలికి గిరిజన ఓటు బ్యాంకును వాడుకొని అత్యంత దారుణంగా గిరిజనులను మోసం చేస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని, మైనార్టీ రిజర్వేషన్ తో గిరిజన రిజర్వేషన్ ను ముడిపెట్టి, అది తప్పు, చట్టబద్ధమైన విషయం కాదని, రాజ్యాంగ వ్యతిరేకమని తెలిసి కూడా కేంద్రానికి తీర్మానం చేసి పంపించడం అనేది యావత్ గిరిజన జాతికి కేసిఆర్ చేస్తున్న అతి పెద్ద మోసం అని దీన్ని గూర్చి గిరిజన సోదరీ సోదరులు ఆలోచిస్తున్నారు. కెసిఆర్ మోసాన్ని అర్థం చేసుకున్నారని, రాబోయే రోజుల్లో కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.ఇకనైనా ప్రత్యేక గిరిజన రిజర్వేషన్ బిల్లు చేసి తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా రిజర్వేషన్ పెంపొందించే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి తీసుకుంటారన్న హామీను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గంగుల నాగేశ్వరరావు,జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి సురేష్, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి జంపాల రవి, యువ మోర్చా మండల అధ్యక్షులు కలసాని పరుశురాం, పార్టీ సీనియర్ నాయకులు మందపల్లి పాపారావు తదితర నాయకులు పాల్గొన్నారు.