చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు --ఎమ్మెల్యే, జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ జిల్లా గ్రంథ

Published: Tuesday September 27, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి): చాకలి ఐలమ్మ  జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలో చింత కుంట మినీ ట్యాంక్ బండ్ దగ్గర చాకలి ఐలమ్మ  విగ్రహానికి పూల మాల వేసి  ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  చంద్ర శేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ఘనంగా నివాళులు అర్పించినారు. వారితో పాటు అడిషనల్ కలెక్టర్ లు బి ఎస్ లత , అరుణశ్రీ, బిసి సంక్షేమ శాఖ అధికారి సాయి బాబా, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ గంగాధర్, బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ లు బాలే  లత శంకర్, పంబాల రామ్ కుమార్, కప్పల శ్రీకాంత్, పద్మ పవన్, పట్టణ, టీఆరెఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, రజక సంఘం జిల్లా, మండల అధ్యక్షులు మర్రిపెళ్ళి నారాయణ, పోచాలు, పట్టణ అధ్యక్షుడు రాజు, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, నాయకులు గంగాధర్, మల్లేష్, విజయ్, రవి, క్రాంతి, శ్రీనివాస్, సంకేమహేష్, మోహన్, నక్కగంగాధర్ ప్రజాప్రతినిధులు నాయకులు రజక సంఘ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.