రాష్ట్రంలో పంచాయతీ భవనాలకు నిధులు కేటాయింపు పై హర్షం వ్యక్తం చేసిన బూర్గంపాడు జడ్పిటిసి కా

Published: Monday December 19, 2022

బూర్గంపాడు (ప్రజాపాలన.)

రాష్ట్రంలో పంచాయతీ భవనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ 737 కోట్లు పంచాయతీ భవనాలకు కేటాయింపు పై హర్షం వ్యక్తం చేసిన బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 168 పంచాయతీ భవనాలకు నిధులు కేటాయించినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో 737 కోట్ల రూపాయలు అత్యధికంగా పంచాయతీ భవనాల అభివృద్ధికి నిధులు కేటాయింపు పై సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారని రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని వారు ఈ సందర్భంగా అన్నారు. పంచాయతీలతోపాటు ఉద్యోగాల కల్పన ప్రజలను ఆరోగ్యవంతులు చేయడం కోసం ఆరోగ్య శాఖలో ఆసుపత్రి డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించినట్లు కూడా వారు ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు సారథ్యంలో పినపాక నియోజకవర్గంలో అన్ని మండలాలు అభివృద్ధి జరుగుతుందని   దానిలో భాగంగా మణుగూరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ని ఏర్పాటు చేశారని, వంద పడకల ఆసుపత్రిని తీసుకువచ్చారని బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్లన్నీ ,నిధులు కేటాయించారని వారు అన్నారు.