జేఈఈ మెయిన్స్ లో మెరిసిన గిరిజన కెరటం అరవింద్ అభినందించిన పడమర తండా గిరిజన నాయకులు

Published: Friday February 10, 2023

బోనకల్, ఫిబ్రవరి 9 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామ పడమర తండాకు చెందిన గిరిజన విద్యార్థి బాణోత్ రవి రజిత దంపతుల చిన్న కుమారుడు బాణోత్ అరవింద్ ఖమ్మం కృష్ణ వేణి కాలేజీ లో ఎంపీసీ చదువు తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 99.09 మార్కులు సాధించి ఐఐటీ ఎగ్జామ్ కూడా అర్హత సాధించాడు. అరవింద్ నిరుపేద కుటుంబంలో పుట్టి తన తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ తన కుమారులను పట్టుదలతో చదివించుకుంటున్నారు. అరవింద్ రావినూతల ప్రభుత్వ పాఠశాలలో 10తరగతి పూర్తిచేసి ఇంటర్మీడియట్ ఖమ్మం కృష్ణవేణి కాలేజీలో చదువుతు గిరిజన కెరటంగా నిలిచి పడమర తండాకు మంచి పేరు సంపాదించి జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాడు. రావినూతల పడమర తండాకు మంచి పేరు తెచ్చి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. తండా గిరిజన నాయకులు గుగులోతు పంతు,బాణోత్ శివల నాయక్, బాణోత్ శ్రీను, గుగులోతు రాములు ,బాణోత్ కృష్ణ, బాణోత్ మాన్య నాయక్, ఉపాధ్యాయులు బాణోత్ రమేష్, గుగులోతు రామకృష్ణ, బాణోత్ తులిసిదాస్ లతో పాటుగా తండా పెద్దలు బాణోత్ సరిరాములు, బాణోత్ నాగేశ్వరరావు, బాణోత్ రామదాసు, బాణోత్ కృష్ణ, బాణోత్ రాజా, బాణోత్ కిరణ్ నాయక్ ,బాణోత్ దేవసింగ్, బాణోత్ స్వామి, గుగులోత్ సైదులు, గుగులోత్ రూప్లా, గుగులోత్ నరేష్, బాణోత్ గోపి, ఖమ్మం కృష్ణవేణి కాలేజీ యాజమాన్యం అరవింద్ మరెన్నో ఉన్నత చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అత్యధిక మార్కులు సాధించిన అరవింద్ ను అభినందించారు.