మహిళల ఔన్నత్యంపై బుర్రకత చెప్పిన మాటూర్ హైస్కూల్ విద్యార్థినులు

Published: Tuesday March 09, 2021

మధిర, మార్చి 08, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా మధిర మండలం లోని మాటూర్ హైస్కూల్ విద్యార్థినులు "అంతర్జాతీయ మహిళా దినోత్సవంను" పురస్కరించుకొని మహిళల ఔన్నత్యాన్ని, మహిళా సాధికారతను బుర్రకథ  రూపంలో పాఠశాల హిందీపండిట్ శ్రీమతి చాంద్ బేగం నేతృత్వంలో చక్కగా వివరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల HM శ్రీ దీవి సాయికృష్ణమాచార్యులు మాట్లాడుతూ విద్యార్థినులను అతి తక్కువ సమయంలో బుర్రకథ ను చెప్పేలా తయారు చేసిన చాంద్ బేగంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా చాంద్ బేగం గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాం, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.