సూపర్ స్ప్రెడర్ గా ఉన్న వారికి కరోనా వ్యాక్సినేషన్

Published: Saturday May 29, 2021
మల్లాపూర్, మే 28 ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వము  ఆదేశాల మేరకు సూపర్ స్ప్రెడర్ ఉన్న పాత్రికేయులు, రేషన్ డీలర్లు, పెట్రోల్ బంక్ మరియు ఎల్పీజీ గ్యాస్ నందు పని చేయు వారు మరియు ఫర్టిలైసెర్స్ నందు పని చేయు వారికి కరోనా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం సూపర్ స్ప్రెడర్ ఉన్న వారికి వ్యాక్సినేషన్ రెవెన్యూ డివిజనల్ అధికారి వినోద్ కుమార్, తహశీల్దార్ రవీందర్, ఎంపిడివో రాజశ్రీనివాస్, వైద్యాధికారి రాకేష్, ఎంపీపీ కాటిపెల్లి సరోజన అద్దిరెడ్డి, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదటి వ్యాక్సిన్ మల్లాపూర్ మండల సాక్షి పత్రిక పాత్రికేయులు తోకల పవనకుమార్కు వేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎఎన్ ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.