ప్రజలలో ఉద్యమ నాయకుడు వేముల

Published: Saturday July 03, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి ప్రజల మనిషి వేముల మహేందర్ చెరుపల్లి సీతారాములు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ప్రజల మనిషిగా వలిగొండ మండల ముఖ్య నాయకులుగా ఎదిగి సిపిఎం ఉద్యమాన్ని విస్తృతం చేయడం కోసం కామ్రేడ్ వేముల మహేందర్ నిరంతరం కృషి చేసేవారని ప్రజల్లో ప్రజల పట్ల విశ్వాసం. కలిగిన నాయకుడిగా నిలిచారని ఆయన ఆశయ సాధన కోసం కార్యకర్తలు అందరూ కృషి చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. వలిగొండ మండల కేంద్రంలోని స్థానిక శివ సాయి ఫంక్షన్ హాల్ లో సిపిఎం నాయకులు అమరజీవి కామ్రేడ్ వేముల మహేందర్ సంతాప సభ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా అధ్యక్షతన జరిగింది. ఈ సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరైన చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ వేముల మహేందర్ చిన్నతనంలోనే ఎర్ర జెండా పట్టి నాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యలపై పనిచేస్తూ నిరంతరం ప్రజల్లో మెదిలిన గొప్ప నాయకుడు అని, అనేక సమస్యలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా ఎర్రజెండాను వదలకుండా తన చివరి శ్వాస వరకు సిపిఎం నాయకుడిగా ప్రజల మనిషిగా పని చేశాడని, ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాలని యువతరం నిస్వార్థంగా నీతిగా నిజాయితీగా స్ఫూర్తితో పని చేయాలని, మహేందర్ లేని లోటు సిపిఎం జిల్లా ఉద్యమానికి ప్రధానంగా వలిగొండ మండల ఉద్యమానికి తీరని నష్టం అన్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కన్నీటి వ్యధను మిగిల్చిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ అండ దండలు అందిస్తుందని ఆయన ఆశయ సాధనకు కుటుంబ సభ్యులు సిపిఎం ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకొని, ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వేముల మహేందర్ నిజమైన కమ్యూనిస్టు కార్యకర్తగా నిస్వార్థంగా ప్రజల కోసం పని చేయడం పట్ల అనేక పార్టీలు ప్రజా నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందన్నారు. ఆయన ఆశయాల్ని సాధించేందుకే కార్యకర్తల ధైర్యంతో ముందుకు వెళ్లి ఆయన ఆశయాన్ని సాధించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ జిల్లా ఉద్యమంలో మహేందర్ పాత్ర కీలకమైంది అన్నారు. ఆయన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తూ అనేక మంది వ్యవసాయ కూలీల సమస్యలపై, పేదల భూ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని, ఆయన వలిగొండ మండల ప్రజా ఉద్యమంలో చెరిగిపోని సాధించాడని, మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ప్రజల్లో గొప్ప పాత్రను పోషించాడని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఆయన స్ఫూర్తితో మండలంలోని పార్టీ కార్యకర్తలు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు, మాటూరి బాలరాజ్ గౌడ్, కల్లూరి మల్లేశం, దోనూరి నర్సిరెడ్డి, బట్టుపల్లి అనురాధ, సిపిఎం మండల కార్యదర్శి మద్దెల రాజయ్య, సీనియర్ నాయకుడు కొమ్మిడి లక్ష్మారెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, వేముల మహేందర్ కుటుంబ సభ్యులు భార్య వేముల లలిత, కుమారుడు జ్యోతి బాబు, కూతురు చైతన్య, సోదరుడు అమరేందర్, సిపిఎం మండల కమిటీ సభ్యులు తుర్కపల్లి సురేందర్, కూర శ్రీనివాస్, కల్కురి రామ్ చందర్, గాజుల ఆంజనేయులు, ఎలే కృష్ణ, వాకిటి వెంకటరెడ్డి, కందాడి సత్తిరెడ్డి, చీరక శ్రీశైలం రెడ్డి, కందుకూరి ముత్యాలు, కర్ణ కంటి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ, పులిగిల్ల శాఖల ఆధ్వర్యంలో వేముల మహేందర్ కుటుంబానికి 1 లక్షా 6వేల రూపాయలు అందించడం జరిగింది.