బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏర్పటు చేసిన ఆరోగ్య శిబిరన్ని ప్రారంభోత్సవం చేసిన... బూర్గం

Published: Saturday December 17, 2022
బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏర్పటు చేసిన ఆరోగ్య శిబిరన్ని ప్రారంభోత్సవం చేసిన... బూర్గంపాడు మండల  జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
బూర్గంపాడు (ప్రజా పాలన.)
 
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో   ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని  బూర్గంపాడు మండల   కామిరెడ్డి శ్రీలత చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది
ఈ సందర్భంగా బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత  మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్ల  బిఆర్ఎస్  పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  ప్రత్యేక చొరవతో  9 మంది  డాక్టర్లను నియమించారని  హాస్పిటల్ అభివృద్ధికి 2.70 కోట్ల నిధులను కేటాయించనారు అని తెలిజేశారు. స్త్రీల కోసం ప్రత్యేకంగా గైనకాలజిస్ట్ డాక్టర్ ని 
 వారానికి 2 రోజు లు సేవలు అందించేలాగా నియనించారాని తెలియజేసారు., అనారోగ్యం వున్నా  ప్రజలు  ఇబ్బందులు పడకుండా  కావలిసిన అన్ని పరికరాలను సమాకూర్చారని  తెలియజేసారు. హాస్పిటల్ కి పూర్వ వైభవం తేవటానికి సహాయాన్ని అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు కి మండల ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు., తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి కోట్లాది రూపాయల నిధులను కేటాయించి ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నదని అన్నారు, తెలంగాణను దేశంలోని అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాల అన్నదే సీఎం కేసీఆర్ గారి సంకల్పమని అన్నారు, ఆరోగ్యవంతమైన తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తూ ప్రాధాన్యత కల్పిస్తున్నారని ప్రాధాన్యత కల్పిస్తున్నారని గుర్తు చేశారు, నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది అన్నారు
ఈ కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్ సిరిపురం స్వప్న  మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసింహారావు ,
బూర్గంపాడు మండల బి ఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని, ఉపదక్ష్యాడు బండారు లక్ష్మీనారాయణ, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు గంగపురి చంద్ర శేఖర్ బూర్గంపాడు టౌన్ యూత్ ప్రెసిడెంట్ కన్నెపల్లి సతీశ్, టౌన్  విభాగం అధ్యక్షుడు మంద ప్రసాద్, ఉపాధ్యక్షడు కుమ్మరిపల్లి నాగరాజు, టౌన్ ప్రచార కార్యదర్శి తోకల సతీశ్, వార్డు మెంబర్ షౌ కత్ అలి, మాజి ఎంపీటీసీ జక్కం సర్వేశ్వర రావు, మాజి జెడ్పీటీసీ బూపల్లి నరసింహారావు, బర్ల ప్రవీణ్, బొందయ, పున్నం, మోతీర్, తదితర పార్టీ నాయకులు,కార్యకర్తలు,యువకులు  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...