నేడే శ్రీ వేణుగోపాల స్వామి గీతా మందిరం విగ్రహ ప్రతిష్టాపన మహా

Published: Friday January 27, 2023

 అన్నదానం కార్యక్రమం మధిర జనవరి 26 ప్రజాపాలన ప్రతినిధి పట్టణంలోని శుక్రవారం నాడు చెరుకుమల్లివారి వీధిలో వేంచేసిన శ్రీ వేణుగోపాలస్వామి గీతామందిరం పునర్నిర్మాణం సంపూర్తి జరుగుతుందని ఈరోజు. ది.27.01.2023 తేదీ ఉదయం 9.36ని. లకు గణపతి, శ్రీ రాధాకృష్ణ సమేత హనుమాన్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగనున్నది. ఈ సందర్భంగా, శ్రీ గణపతి, రాధాకృష్ణులు, హనుమాన్ మూలవిరాట్టు విగ్రహములు, రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహములు మధిర పట్టణ పుర వీధులలో కోలాహలంగా ప్రత్యేక భజనలతో, గీతామందిర్ ప్రక్కనే ఏర్పాటు చేసిన యాగశాలకు మూడు రోజులు పాటు ప్రత్యేక పూజలుతో భక్తులకు. మేళతాళాలతో ప్రారంభమైన మొదటి రోజు నుండి కార్యక్రమాన్ని గీతామందిర్ పాలక కమిటీ అధ్యక్షులు కర్లపూడి వాసు, కార్యదర్శి గొండేల సూర్యప్రకాశరావు, కోశాధికారి వేమూరి సునీల్ కుమార్ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు., ఆతుకూరు హనుమాన్ డాల్ మిల్ డాల్ మిల్ యజమాని గొండేల వెంకట కృష్ణమూర్తి, రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహముల దాత ప్రాంగణం నుండి ప్రారంభమయిన వూరేగింపు సాయంత్రం వరకు కొనసాగుతుందని లాస్ట్ రోజు ఉదయాన్నే విగ్రహ ప్రతిష్ట మహోత్సవం మహా అన్నదానం కార్యక్రమం లో భాగంగా భక్తులు పాల్గొని దిగ్విజయం చేశారని పాలక కమిటీ తెలిపారు. భక్తులందరూ స్వామి వార్లను దర్శించుకుని స్వామి కరుణా కటాక్షములను పొందగలరని తెలిపారు. ప్రతిరోజు జరిగే కార్యక్రమంలో గీతామందిర్ అర్చకులు రాయప్రోలు ప్రసాద శర్మ, రాయప్రోలు విజయకుమార్ శర్మ కమిటీ కార్యవర్గ సభ్యులు కోమటీడ శ్రీనివాస రావు పాల్గొన్నారు అనంతరం భక్తులకు ప్రతిరోజు తీర్థప్రసాదాలు అందించారు నేడు జరిగే ప్రతిష్ట మహోత్సవానికి మహా అన్నదానం కార్యక్రమాలు పాల్గొని అధిక సంఖ్యలో ప్రజలు భక్తులు పాల్గొనాలని ఆలయ కమిటీ వారు తెలిపారు