బీసీ నేత శ్రీనివాస్ జన్మదిన వేడుకలు..

Published: Friday July 15, 2022
తల్లాడ, జులై 14 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణపురపు శ్రీనివాస్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం తల్లాడ మండల అధ్యక్షులు గోవిందు శ్రీనివాసరావు (ట్రాక్టర్) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఇటువంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, రానున్న రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ గోవిందు విజయమ్మ, ఉప సర్పంచ్ గోవిందు భాగ్యమ్మ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు(కెవీ), తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య, మారెళ్ళ మల్లికార్జున రావు, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్. యాకూబ్ పాషా, కోసూరి రామారావు, రాఘవ, పిన్ని కృష్ణయ్య, పిచ్చయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.