జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు...

Published: Monday January 31, 2022

ఎర్రుపాలెం జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి: ఆదివారం నాడు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు నందు జాతిపిత మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పంబి సాంబశివరావు, మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ చావా కృష్ణ, ఎంపీపీ శ్రీమతి దేవరకొండ శిరీష, జెడ్ పి టి సి శ్రీమతి శీలం కవిత. అనంతరం వారు మాట్లాడుతూ జాతి పిత మహాత్మా గాంధీ అని భారతదేశానికి అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వతంత్ర సంగ్రామాని ముందుకు నడిపించిన జాతిపిత మన మహాత్మా గాంధీ అని, ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘ మండల అధ్యక్షులు మొగిలి అప్పారావు, రేమిడిచర్ల సర్పంచ్ పురుషోత్తం రాజు, గుర్రాల పుల్ల రెడ్డి, దేవరకొండ రవి, ఎస్సీ సెల్ ఇనపనూరి భాస్కర్, ఎస్ కె హుసేన్, నాగ మల్లేశ్వర, పల్లెకంటి సుధీర్‌, తదితరులు పాల్గొన్నారు.