డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సౌజన్యంతో కమ్యూనిటీలో విద్యార్థులకు విద్యా బోధన.

Published: Friday June 25, 2021

జిన్నారం, జూన్ 24, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా కారణంగా విద్యార్థులు గత సంవత్సరం నుండి విద్యకు దూరం అయ్యారని. విద్యార్థులు ఇంట్లోనే ఉండటం వల్ల వారు చదువుపై దృష్టి సారించలేక పోతున్నారని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సహాయంతో విద్యార్థుల ఇంటి వద్దకే వచ్చి భౌతిక దూరం పాటిస్తూ విద్యను చెప్పిస్తున్నారని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8 నుండి 11 గంటల వరకు విద్యార్థులకు గణితం, సైన్స్, ఇంగ్లీష్, కంప్యూటర్, యోగ తదితర అంశాలపై గత నెల రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని గడ్డపోతారం, దుండిగల్, గగిలాపూర్, బచూపల్లి, సురారం కమ్యూనిటీలో చదువు చెప్పేస్తున్నమన్నారు. విద్యార్థులు కూడా శ్రద్ధగా నేర్చుకుంటున్నారని వారు అన్నారు.. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు..