హరిదాసుపల్లిలో నీటి కటకట

Published: Wednesday August 03, 2022
పిఎసిఎస్ డైరెక్టర్ రాఘవేందర్
వికారాబాద్ బ్యూరో 02 ఆగస్టు ప్రజా పాలన : హరిదాసు పల్లి గ్రామంలో 3, 4, 7వ వార్డులలో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని పిఎసిఎస్ డైరెక్టర్ రాఘవేందర్ అన్నారు. మంగళవారం ధారూర్ మండల పరిధిలోని హరిదాసుపల్లి గ్రామంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎబ్బనూర్ చెరువు కాలువ హరిదాసుపల్లి గ్రామానికి వచ్చే కాలువ బంద్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కాలువకు 1000 ఎకరాలు పారకం జరుగుతుందని గుర్తు చేశారు. బీరప్ప దేవాలయానికి వెళ్లడానికి రోడ్డు వేయించాలని ఎమ్మెల్యేను కోరారు. అంగన్వాడి టీచర్ గత పది సంవత్సరాల నుండి మా గ్రామానికి కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి దీపాలు లేక చీకటిలో వెళ్లాలంటేనే  జంకుతున్నారని అన్నారు. గ్రామంలోని మోరియలన్నీ నిండుకుండలా తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో వానలు ఎక్కువగా కురుస్తున్నందున మోరీలోని మురికి నీరంతా ఇళ్లలోకి వచ్చి చేరుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వెంట వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేటట్లు ఆదేశించాలనే ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.
పాఠశాలలో బాత్రూమ్స్ శుభ్రము లేకపోవడంతో పాఠశాల పరిసరాలు దుర్గంధ భరితంగా తయారయ్యాయని పేర్కొన్నారు.