పెండ్లిమడుగు రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలు పంపిణీ : వికారాబాద్ ఎంపిపి కామిడి చంద్రకళ

Published: Wednesday September 29, 2021
వికారాబాద్ బ్యూరో 28 సెప్టెంబర్ ప్రజాపాలన : పెండ్లిమడుగు రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలను పంపిణీ చేశామని వికారాబాద్ మండల ఎంపిపి కామిడి చంద్రకళ అన్నారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని పెండ్లిమడుగు గ్రామ రైతులకు గ్రామ సర్పంచ్ కెరెల్లి బుచ్చిరెడ్డి, మండల వ్యవసాయాధికారి సీహెచ్. రమేష్, కొత్తగడి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి జి.అనిల్ కుమార్, కార్యదర్శి సంజీవ్ కుమార్ లతో సబ్సిడీ శనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేల స్వభావం విత్తే సమయం ఆధారంగా పంటలను వేసుకోవాలని సూచించారు. వేరుశనగ ఆముదం పొద్దుతిరుగుడు కంది పెసర మినుము జొన్న మొక్కజొన్న వులువలు వంటి పంటలను యాసంగి లో వేసుకోవచ్చని హితవు పలికారు. సెప్టెంబర్ మొదటి పక్షం నుండి నవంబర్ రెండవ పక్షం వరకు ఈ పంటలను సాగు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.