ఎస్.సి స్మశానవాటిక అభివృద్ధికి రూ.10 లక్షల రూపాయలతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జడ్పీ చైర

Published: Tuesday March 15, 2022

మధిర మార్చి 14 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం సిరిపురం గ్రామంలో సోమవారం నాడు 10 లక్షల వ్యయంతో ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు. ఆనందోత్సాహాలతో హర్షం వ్యక్తం చేస్తున్న సిరిపురం గ్రామస్తులు. భారీగా తరలివచ్చి పూల జల్లుతో స్వాగతం పలికిన మహిళలు, గ్రామస్తులు. ఎన్నో ఏళ్ల కలను జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కృషితో సాకారం అయింది.. మధిర మండలంలోని సిరిపురం గ్రామంలో మధిర - వైరా ప్రధాన రహదారిపై ఉన్న ఎస్.సి స్మశానవాటిక అభివృద్ధి అక్కడ ప్రజలకు కలగానే ఉండిపోతుంది. కాగా ప్రస్తుతం జడ్పీ చైర్మన్ గా ఉన్న లింగాల కమల్ రాజు ప్రత్యేక చొరవతో ఆ కల సాకారం అయింది స్మశానవాటిక చుట్టూ పహరీ గోడ సహా పలు అభివృద్ధి పనుల కోసం జడ్పీ నుండి ఆయన రూ.10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి సోమవారం నాడు స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు శంకుస్థాపన చేశారు.. దీనితో ఎన్నో ఏళ్ల తమ కల సాకారం చేసిన లింగాల కమల్ రాజు కృషి పట్ల సిరిపురం గ్రామస్తులు ఆనందోత్సాహాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ముందుగా గ్రామానికి చేరుకున్న లింగాల కమల్ రాజు కి పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు తరలి వచ్చి పూల జల్లుతో ఘన స్వాగతం పలికారు అక్కడ నుండి భారీ ర్యాలీగా వెళ్లి స్మశానవాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అక్కడ రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంపీపీ మొండెం లలిత, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, సర్పంచ్ కనకపూడి పెద్ద బుచ్చయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, TRS మండల పార్టీ & టౌన్ పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, నియోజకవర్గ యువజన విభాగం కన్వీనర్ కూన నరేందర్ రెడ్డి, బొగ్గుల భాస్కర్ రెడ్డి, వెలగపూడి ప్రసాద్, కనకపూడి శ్రీను, నండ్రు విజయరావు, ఎర్ర మోషా, గుజ్జు శిలవా, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.