పీర్జాదిగూడలో ఇంటి పై పిడుగు పడింది

Published: Thursday September 23, 2021
పీర్జాదిగూడ, సెప్టెంబర్ 22, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కురుస్తున్న వర్షాలకు 1వ డివిజన్ సుమా రెసిడెన్సి కాలనీలో నివాసముండే (ఇంటి నెంబర్ 16-27) ఎం శరత్ బాబు ఇంటి పై పిడుగు పడింది. ఇంటిపై పిడుగు పడడంతో ఇల్లు స్వల్పంగా దెబ్బతిన్నది. ఇంట్లోని ఎలక్ట్రికల్ వస్తువులు మరియు చుట్టుపక్కల వారి ఎలక్ట్రికల్ సామాన్లు టీవీలు, రిఫ్రిజిరేటర్లు పాడైనవి, ఆస్తి నష్టం జరిగింది కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.