ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 23 ప్రజాపాలన ప్రతినిధి *ఘనంగా ప్రజానాట్యమండలి పూర్వ కళాకారుల సమ్

Published: Tuesday December 27, 2022
ఇబ్రహీంపట్నం వైష్ణవి గార్డెన్స్ లో సభాధ్యక్షుడు. జిల్లా అధ్యక్షుడు ఎం జె వినోద్ కుమార్, పి. దనేశ్వర్ ఆధ్వర్యంలో పూర్వ కళాకారుల సమ్మేళనం నిర్వహించడం జరిగింది. సోమవారం జరిగిన పూర్వ కళాకారుల సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఎం జగ్గరాజు, గాయకుడు జగన్, పి ఏ దేవి  రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ  హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గరాజు మాట్లాడుతూ
కాళ్ళకు గజ్జగట్టి డప్పు సంకనవేసుకుని  ప్రతి గుడిసె గుడిసెలో
వెలుగుల బాటలు వేయడం కోసం ఆటలుఆడి, పాటలు పాడి పోరాట గళాలతో భూస్వాముల పెత్తందారుల వణికించిన చరిత్ర ప్రజానాట్యమండలిదని అన్నారు. ఆటలాడి
వీధి నాటకోత్సవాలలో ప్రజల నిజ జీవితాలను  నాటకాలుగా ప్రదర్శించి ప్రజలను చైతన్యం పరిచారనే, దొరలు భూస్వాముల ఆగడాలను పేత్తందార్ల తీరును  అణచడానికి ఎర్ర జెండా పాటలై ఎద గుండెల సప్పుడై
ప్రజా కలలకు వారదులైన ప్రజానాట్యమండలి ప్రజా కళాకారులు
వాళ్ళను కలుసుకొని వాళ్ళను సత్కరించి వాళ్ళ అనుభవాలను పంచుకోవడం మన కర్తవ్యం అని హితబోధ చేశారు.
ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి  పూర్వకళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ అనుభవాలను వాళ్ల సహకారాలను నవ యువ కళాకారులకు నూతన ఉత్తేజాన్ని అందిచాలని ఆయన అన్నారు. కళాకారులు గ్రామీణ జనపద యాసలో పాడిన పాటలు, పోరాట గ్రానామృతాన్ని గళం విప్పడంతో సభికులు ఉత్తేజితులైనారు. పూర్వ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు  కళాకారులకు సభికులు విప్లవా భివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, మాజీ జిల్లా కార్యదర్శి తులసి గారి నరసింహ, రచయిత్రి ఆనం గళ్ళ భాస్కర్, ఉమ, కంబాలపల్లి ఇస్తారి, అంజయ్య ,జానీ, పి .యాదగిరి , సిహెచ్ మల్లేష్ ,ఏ.గణేష్,  నీరటి మల్లేష్, జంగయ్య, పుష్ప, శ్యామల, శారద, యశోద, చేతల్ల జంగయ్య, ఆలంపల్లి నరసింహ్మ, రాములు దాదాపు 300 మంది కళాకారులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు.