తాండూర్ మండలంలో ఘనంగా ఈద్-ఉల్-ఫితర్

Published: Wednesday May 04, 2022
తాండూర్, మే 03, ప్రజాపాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని తంగళ్ళపల్లి ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగను మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈద్గా వద్ద వేల సంఖ్యలో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా జామా మస్జిద్ ఇమామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ ఉపవాసాలు సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి అనంతరం ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగ జరుపుకుంటారు. లోకకళ్యాణానికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రతి ఒక్కరు స్నేహపూర్వకంగా ఉండాలని ప్రార్ధన అనంతరం ఈద్గా వద్ద ఎన్నో సంవత్సరాల ఆచార ప్రకారం మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు అక్కడికి వచ్చిన ముస్లిం సోదరులతో కలిసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీనితో దర్గా వద్ద హిందువులు ముస్లింలు బాయ్ బాయ్ భావన కనబడింది. ఎన్నో ఏళ్లుగా వివిధ కారణాలవల్ల దర్గా వద్ద ప్రార్థనలు నిర్వహించనప్పటికీ ఈసారి   తాండూరు గ్రామానికి చెందిన మంజూర్ హైమత్ ఖాన్. ఎండి.సూబుర్ ల ప్రోత్సహంతో అందరూ ముస్లిం సోదరులు ఒక కాడ ఐ ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ చేశారు. వారిని ముస్లిం సోదరులు అభినందించారు. అలాగే దర్గా వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాండూర్ సీఐ జగదీష్ ఆధ్వర్యంలో తాండూర్ ఎస్సై మధుసూదన్ మాదారం ఎస్ఐ సమ్మయ్య. ఎస్సై లక్ష్మణ్ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. తాండూర్ మండలానికి చెందిన తాండూర్ జడ్పీటీసీ సాలిగం. బాణయ్య, రైతు సమన్వయ మండల కమిటీ అధ్యక్షులు దత్తాత్రేయ రావు, ఎంపీటీసీ సిరంగి. శంకర్ . మంగపతి సురేష్ బాబు.. పి. రాజన్న .వివిధ పార్టీల నాయకులు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.