ప్రజా సమస్యలపై పోరాడే ఉద్యమ నాయకుడు హెచ్చు కోటయ్య : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంక

Published: Monday January 17, 2022
బోనకల్, జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవింద పురం ఎల్ గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు హెచ్చు కోటయ్య మృతి శనివారం గుండెపోటుతో మృతి చెందారు. వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సిపిఎం పార్టీలో అనునిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై పోరాడే ఉద్యమ శిఖరాన్ని కోల్పోయామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. కోటయ్య మృతదేహంపై ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు. మృతదేహాన్ని ఆర్ సి యం చర్చిలో అర్ధ గంట పాటు ఉంచి ఫాదర్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. ఫాదర్ మాట్లాడుతూ హెచ్చు కోటయ్య గోవిందపురం ఆర్సీఎం చర్చి సంఘ పెద్దలుగా ఎంతో సహాయ సహకారాలు అందించారని చర్చికి అందించిన సేవలు మరువలేనివని అన్నారు. గ్రామ కమిటీ మాట్లాడుతూ ఆయన సిపిఎం పార్టీ కి ఎంతో సహాయ సహకారాలు అందించారని, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడిగా పనిచేశారని కూలి పోరాటాలలో ముందుండి నడిపించిన వ్యక్తి హెచ్చు కోటయ్య ఆయన సేవలు మరువలేని అని అన్నారు. పొన్నం వెంకటేశ్వరరావు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శ ఉమ్మనేని రవి, మాజీ సర్పంచ్ మాదినేని నారాయణ, సొసైటీ చైర్మన్ మాదినేని వీరభద్రరావు, ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య, మాజీ ఎంపీపీ, జడ్పిటిసి కొమ్ము శ్రీనివాసరావు, మాజీ సొసైటీ చైర్మన్ ఉమ్మనేని కోటయ్య, మాజీ సర్పంచ్ కొమ్ము కమలమ్మ, కళ్యాణపు శ్రీనివాసరావు, ఏడునూతల లక్ష్మన్ రావు, వార్డ్ నెంబర్ పొన్ను రాంబాబు, టీచర్ లక్ష్మణ్, మాది నేని రామచంద్రరావు, కోట కాటయ్య, నల్లమోతు నాగేశ్వరరావు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, కెవిపిఎస్ మాజీ నాయకులుఏసు పోగుబాబు, టిఆర్ఎస్ నాయకులు కళ్యాణపు నాగేశ్వరరావు, సర్పంచ్ ఉమ్మనేని బాబు టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షు కంచర్ల వెంకటి, బాబు తదితరులు పాల్గొన్నారు.