అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ బుడిద రామ్ రెడ్డి

Published: Friday April 22, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 21 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో  బూడిద రామ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి  తాళ్ల మన్నెమ్మ మరణ వార్త విని వారి పార్ధివదేహాన్ని సందర్శించి వారి అబ్బాయి భద్రప్పకు 10,000 పదివేల రూపాయల ఆర్థిక సహాయం అంత్యక్రియల కొరకు అందజేయడం జరిగింది సర్పంచ్ రామ్ రెడ్డి, చేస్తున్న సేవలను గ్రామ ప్రజలు   ఎప్పటికీ మర్చిపోరని పలువురు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు మడుపు గోపాల్ తెరాస నాయకులు బూడిద భీమా అర్జున్ రెడ్డి, మరియు ఏన్ను జైపాల్ రెడ్డి, తాళ్ల నరసింహ, తాళ్ల నవీన్, నరేష్, వారి కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.