బిజెపి 100 కిమీ ప్రజా సంగ్రామ యాత్ర సంబురాలు

Published: Tuesday September 07, 2021
వికారాబాద్ బ్యూరో 06 సెప్టెంబర్ ప్రజాపాలన : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 100 కి.మీ. పూర్తైన సందర్భంగా ఘనంగా సంబురాలు నిర్వహించారు. సోమవారం వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల పరిధిలో 100 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు 100 కిలోల కేకు కట్ చేసి సంబురాలు నిర్వహించారు. బిజెపి యువ మోర్చా నాయకులు టపాసులు కాల్చి, బెలూన్లు ఎగురవేసి సంబరాలు మిన్నంటాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 100 కేజీల కేక్ కట్ చేసి నాయకులు ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రజా సంగ్రామ పాద యాత్రను వికారాబాద్ ప్రజలు ఆశీర్వదించారని హర్షం వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో కుటుంబ పాలనకు అంతమొందించే ఘడియ వచ్చిందన్నారు. అవినీతి, నియంతృత్వంతో హిట్లర్ మాదిరిగా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రజా సంగ్రామ పాద యాత్ర లక్ష్యమని వివరించారు. 2023 లో బిజెపి అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బిజెపికి పోలీసులకు మధ్య అపోహలు సృష్టించే ప్రయత్నం కేసిఆర్ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు.