చనిపోయిన మల్టీపర్పస్ వర్కర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: సిఐటియు మండల అధ్యక్షులు మరిదు

Published: Monday December 20, 2021
బోనకల్, డిసెంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండలం గార్లపాడు గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ గా పని చేస్తున్నటువంటి కనక పూడి వెంకటి పంచాయతీ పనులు విధులను నిర్వహించి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కిందపడిపోయి చనిపోయినాడు. వెంకటి మృతదేహానికి మండల పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరికుటుంబము చాలా నిరుపేద కుటుంబం అంత్యక్రియలు జరుపుకొనుటకు కూడా స్తోమత లేని కుటుంబం గ్రామ పంచాయతీలో ఇచ్చేటువంటి 8500 రూపాయలను కుటుంబ పోషణకు గడవడమే అతి కష్టం మీద ఉన్నది .పంచాయతీ లో పని చేసినటువంటి వారి జీవితం కూడా చాలీచాలని జీతాలతో జీవనం గడుపుతున్నారు. బాగా ఉన్న కుటుంబంలో ఒక కుక్కను పెంచుకొని ఎలా చూసుకుంటారో అలాంటి జీవితం కూడా లేనటువంటి దుర్భర పరిస్థితిలో జీవనం గడుపుతున్నారు. ఉదయం లేచిన నుండి మురికి కాలువలు, చెత్తాచెదారం తొలగించి గ్రామాలలో పట్టణాలలో మా ప్రాణాలను అడ్డు పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నామని, అటువంటి వారికి ఇటువంటి దీనస్థితి రావటం చాలా బాధాకరంగా ఉన్నదనీ, కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎక్స్గ్రేషియా గాని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్, సిఐటియు మండల అధ్యక్షులు మరీదు పుల్లయ్య, మండల ఉపాధ్యక్షులు అంతోటి రమేష్, నాగరాజు, సురేష్, రామయ్య, కాసిం, రాము గోపాలన్ తదితరులు పాల్గొన్నారు.