ఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతి

Published: Tuesday April 06, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలోని తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలలో సోమవారం బాబు జగ్జీవన్ రావు144 వ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్ రాజు, సర్పంచ్ బొల్ల లలితా శ్రీనివాస్, ఎంపిటిసి పలుసం రమేష్, తహశీల్దార్ నాగలక్ష్మి, ఎంపిఓ కేదారీశ్వర్, కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.